Friday 16 November 2012

Indian Politics

1. పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్నకు ఈ విధమైన సమాధానం రావాలి?
    1. లిఖిత పూర్వక సమాధానం
    2. మౌఖిక సమాధానం
    3. సమాధానం ఈయకపోవడం
    4. చర్య     [2]

2. ఇండియాలో బిల్లు సెలెక్ట్ కమిటీకి ఎప్పుడు పంపబడును?
    1. ప్రవేశమప్పుడు
    2. మెదటి రీడింగ్
    3. రెండవ రీడింగ్
    4. మూడవ రీడింగ్     [3]

3. ఏ సందర్భంలో రెండు లేద మూడు రాష్ట్రాల సంబంద విశయాల పై శాసనం చేయడానికి హక్కు ఉంటుంది?
    1. దానిని ఆమోదించడంసంబంధిత రాష్ట్రాల శాసనసభలు తీర్మానం ద్వారా ఒప్పందము తెలిపినచో
    2. దానిని ఆమోదించడం సంబంధిత రాష్ట్రాల శాసనసభలు 2/3 భాగము ఆధిక్యతతో సీటు ద్వారా ప్రస్థానము జారీ చేయుటచే
    3. అన్ని రాష్ట్రాల శాసనసభలు 1/4 భాగము ఓటులో ఆమోదము తెల్పినచో
    4. అన్ని రాష్ట్రాల శాసనసలు ఆమోదము తెల్పి రాష్ట్రపతి ఒప్పుకున్చచో     [1]

4. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది?
    1. అంచనాల సంఘం
    2. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ
    3. ప్రభుత్వ ఖాతాల సంఘం
    4. కమిటీ అన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్     [2]

5. పార్లమెంటు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరయినది ఏది?
    1. ఇందులో లోక్-సభ సభ్యులు 22 మంది, రాజ్యసభ సభ్యులు 15 మంది ఉంటారు.
    2. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఇందులో ఉంటారు.
    3. లోక్-సభ సభ్యులు మాత్రమే ఇంతులో ఉంటారు.
    4. రాజ్యసభ సభ్యులు మాత్రమే ఇంతులో ఉంటారు.     [2]

6. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు?
    1. పార్లమెంటు
    2. కేంద్రకేబినెట్
    3. భారత రాష్ట్రపతి
    4. రాజ్యసభ అద్యక్షిడిని సంప్రదించి లోక్-సభ స్పీకర్     [1]

7. అవశేషాధికారాలకు సంబంధించిన విషయాల మీద చట్టాలు చేసే హక్కు భరత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లభించింది?
    1. రాష్ట్ర శాసన సభలకు
    2. పార్లమెంట్ కు మాత్రమే
    3. రాష్ట్ర శాసన సభల ఆమోదంతో పర్లమెంట్ కు
    4. సుప్రీంకోర్టు నిర్ణయించిన విధంగా పార్లమెంట్ కు గానీ, లేక రాష్ట్ర శాసన సభలకు     [2]

8. పార్లమెంటు ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైనా బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయునది?
    1. సాదారణ మెజారిటీ
    2. మూడింట రెండు వంతుల మెజారిటీ
    3. ప్రతిసభ యొక్క మెజారిటీ విడివిడిగా
    4. మొత్తం సభ్యుల సంపూర్ణ మెజారిటీ     [1]

9. నూతన రాష్ట్రాల ఏర్పాటుకు మరియు ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దుల మార్పు ఎవరిచే జరుగుతుంది?
    1. భారత రాష్ట్రపతి
    2. పార్లమెంటు చట్టం ప్రకారంగ
    3. రాష్ట్రం స్వయంగానే
    4. రాష్ట్ర శాసన సభలలో సగం కంటే తక్కువ కాకుండ సమ్మ్తి పొందిన తర్వాత పార్లమెంట్ చే గుర్తింపు పొందుట.     [2]

10. పార్లమెంట్ కు ఈ క్రింది ఏ జాబితా అంశాల పై చట్టాలు చేయడానికి అధికారం కలదు?
    1. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా
    2. కేంద్ర జాబితా, ఉమ్మడి జామితా
    3. రాష్ట్ర జాబితా, ఉమ్మది జాబితా
    4. ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా     [2]

11. సంఘ్టిత నిధి నుంచి కేటామింపులు ఈ క్రింది ఏ బిల్లుల పరిఇలోనికి వస్తాయి?
    1. సాదారణ బిల్లు
    2. ప్రైవేట్ మెంబర్ బిల్లు
    3. ఆర్థిక బిల్లు
    4. పబ్లిక్ బిల్లు     [3]

12. లోక్-సభలో మాత్రమే ముందు ప్రవేశపెట్టే ఆర్థిక భిల్లును ధృవీకించునది?
    1. రాష్ట్రపతి
    2. స్పీకరు
    3. ఆర్థిక మంత్రి
    4. పార్లమెంటు     [2]

13. సాధారణంగా ఒక బిల్లు చట్టంగా చెలామణి కావడానికి దాటు దశల్లో ఇది చివరిది?
    1. నిడ్ణాయక సంగ పరిశీలన
    2. నివేదిక
    3. టృతీయ పఠనం
    4. రాష్ట్రపతి ఆమోదముద్ర     [4]

14. ఈ దశలో "బిల్లు" పై చర్చ జరుగదు?
    1. ప్రథమ పఠనం
    2. ద్వితీయ పఠనం
    3. తృతీయ పఠనం
    4. నివేదిక     [1]

15. నిర్ణాయక సంఘంలో సభ్యుడిగానియామకం పొందితే హోదను బట్టి అతడే చైర్మన్?
    1. లోక్-సభ స్పీకర్
    2. ప్రధానమంత్రి
    3. లోక్-సభ డిప్యూటీ స్పీకర్
    4. హోం మంత్రి     [3]

16. ఒక బిల్లు స్పీకర్ అదేశం పై ఓటింగ్ కు ఈ క్రింది ఏ దశలో పెట్టబడుతుంది?
    1. తృతీయ పఠనం
    2. ద్వితీయ పఠనం
    3. ప్రథమ పఠనం
    4. చతుర్థ పఠనం     [1]

17. ఈ క్రింది ఏ నిబందన ప్రకారం రాష్ట్రపతి ప్రతి సం|| వార్షిక బడ్జెట్ ను 31 మార్చి లోగా పార్లమెంట్ కు నివేదిస్తారు?
    1. 356
    2. 324
    3. 354
    4. 112     [4]

18. ఈ క్రింది ఏ ఖర్చుకు పార్లమెంట్ లాంఛనంగా తన ఆమోదాన్ని తేలుపుతుంది?
    1. భారత రాష్ట్రపతికి సంబంధించిన జీతభత్యాలు
    2. లోక్-సభ స్పీకర్, రాజ్యసభ అధ్యక్షుని జీతభత్యాలు
    3. ప్రభుత్వ ఋణాలు     4. పైవన్ని     [4]

19. పార్లమెంటరీ కమిటీల కార్యకలాపాలను అజమాయిశీ చేసే అధికారం ఇతడికి కలదు?
    1. సంబంధిత కిమిటీ అధ్యక్షుడు/చైర్మన్
    2. ప్రధానమంత్రి
    3. రాష్ట్రపతి
    4. స్పీకరు     [4]

20. నిబందనల కమిటీకి ఇతడు అద్యక్షుడు?
    1. ప్రదానమంతి
    2. హోంమంత్రి
    3. ప్రతిపక్షనేత
    4. స్పీకర్     [4]

21. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ద్వారా ఎన్నుకోబడిన 30మంది సభ్యులు గల ఈ క్రింది ఏ కమిటీకి లోక్-సభ సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహించెదరు?
    1. సలహా సంఘం
    2. ప్రభుత్వ ఖాతాల సంఘం
    3. ఉపక్రమాల సంఘం
    4. అంచనాల సంఘం     [4]

22. CAG (Comptreler andAuditor General) నివేదిక ఆధారంగా పరిశీలించబడు ఈ సంఘానికి ప్రతిపక్ష నేత నేతృత్వం వహిస్తాడు?
    1. ప్రభుత్వ ఖాతాల సంఘం
    2. ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
    3. అంచనాల సంఘం
    4. నియమాల సంఘం     [1]

23. ఇతడు బ్రిటన్ లో రాజమకుటం వలె (రాజు/రాణి వలె) నమమాత్రపు అధినేత?
    1. భారత ప్రదానమంత్రి
    2. భారత హోంమంత్రి
    3. భారత ప్రదాని మరియు హోంమంత్రి
    4. భారత రాష్ట్రపతి     [4]

No comments:

Post a Comment